మంత్రాలయం నియోజకవర్గ ఓటర్లను ఉద్దేశించి డాక్టర్ పార్థసారథి చేసిన ఒక ఘాటైన రాజకీయ ప్రసంగం ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రాలయం ప్రజలు వైసీపీ అభ్యర్థిని గెలిపించడాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు పార్దసారధి. ఆ రోజు వైసీపీని గెలిపించడం వల్ల, ఇప్పుడు ఆ ప్రాంతం రాజకీయంగా తలవంపులు పడాల్సి వస్తోందని పార్ధసారధి ఘాటైన విమర్శలు చేశారు.
మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అందుకే, ఇప్పుడు మన ముందున్న ఏకైక అవకాశం రాబోయే సర్పంచ్ మరియు జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలే అని ఆయన గుర్తుచేశారు. ఓటర్లందరూ ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
ఇది కేవలం ప్రసంగం మాత్రమే కాదు, ప్రజలకు ఒక యుద్ధభేరి లాంటిది. మంత్రాలయం ప్రజలందరూ ఇప్పటికైనా ఒక్కటై, రాబోయే ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా ఓడించేందుకు ఇప్పటి నుండే సిద్ధం కావాలని డాక్టర్ పార్థసారథి పిలుపునిచ్చారు.
గెలిచాం కదా అని సంబరపడిపోతున్న ప్రస్తుత నాయకుల అధికారానికి అడ్డుకట్ట వేయడమే మన అంతిమ లక్ష్యం కావాలి. దానికి సరైన సమయం ఇదే… ఈ స్థానిక ఎన్నికల్లోనే మన సత్తా చాటాలని, ప్రజలు సంఘటితం కావాలని ఆయన కోరారు.

