డా. పి.వి. పార్థసారథి, ఆయన సేవా గుణంతో ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడే ఓ భారత రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తన సేవలని అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమమే లక్ష్యంగా భావించి, బీజేపీ–టిడిపి–జనసేన కూటమిగా ఏర్పడి 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున పోటీ చేసిన పి.వి. పార్థసారథి గారిని ఆదోని ప్రజలు అఖండ మెజారిటీ ఓట్లతో గెలిపించారు.
ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచీ ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి గారు ఆదోని అభివృద్ధిపై, ప్రజల అవసరాలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే తన నియోజకవర్గ ప్రజల కోసం రోడ్లు–మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాలు వంటి రంగాలను మెరుగు పరిచే దిశగా అభివృద్ధి పనులను మొదలు పెట్టి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.