shape_3.png

జననేత

డా. పి.వి. పార్థసారథి గారి పరిచయం

డా. పి.వి. పార్థసారథి, ఆయన సేవా గుణంతో ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడే ఓ భారత రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తన సేవలని అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమమే లక్ష్యంగా భావించి, బీజేపీ–టిడిపి–జనసేన కూటమిగా ఏర్పడి 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున పోటీ చేసిన పి.వి. పార్థసారథి గారిని ఆదోని ప్రజలు  అఖండ మెజారిటీ ఓట్లతో గెలిపించారు. 
ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచీ ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి గారు ఆదోని అభివృద్ధిపై, ప్రజల అవసరాలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే తన నియోజకవర్గ ప్రజల కోసం రోడ్లు–మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాలు వంటి రంగాలను మెరుగు పరిచే దిశగా అభివృద్ధి పనులను మొదలు పెట్టి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.

ఆదోని అభివృద్ధి — డా. పార్థసారథి గారి దిశా, ప్రజల ఆశా!

ప్రతి ఇంటికి అభివృద్ధి… ప్రతి హృదయంలో నమ్మకం!

మంచి రోడ్లు

ఆదోని జిల్లా – కొత్త మండలాలు

యువతకు ఉద్యోగాలు & విద్య

ప్రజలకు ఆరోగ్యం & శుభ్రమైన నీరు

ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి

ప్రజల నుంచి రాజకీయ నేతలు, సెలబ్రిటీస్ మరియు మరెందరో ముఖ్యమైన వ్యక్తులతో డా. పార్థసారథి గారు కలిసి ముచ్చటించిన ఈవెంట్స్ కి సంబందించిన స్పెషల్ మోమెంట్స్ అన్నీ ఫోటోల రూపంలో..